శ్రీదేవి అస్థికలను రామేశ్వరంలో నిమజ్జనం చేయనున్న బోనీకపూర్!

  • చార్టర్డ్ విమానంలో చెన్నైకు బోనీ ఫ్యామిలీ
  • చెన్నై నుంచి రామేశ్వరానికి చేరుకోనున్న కుటుంబ సభ్యులు 
  • అనంతరం, తిరిగి ముంబైకు పయనం
సినీ నటి శ్రీదేవి అస్థికలను రామేశ్వరం వద్ద సముద్రంలో నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం ఆమె భర్త బోనీకపూర్ ఇతర కుటుంబసభ్యులతో కలిసి ముంబై నుంచి చార్టర్డ్ విమానంలో ఈరోజు రాత్రికి చెన్నై చేరుకుంటారు. అక్కడి నుంచి రామేశ్వరం వెళతారని సమాచారం. రామేశ్వరంలో అస్థికలు నిమజ్జనం చేసిన తర్వాత తిరిగి ముంబై వెళతారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, దుబాయ్ లో తమ బంధువుల వివాహానికి హాజరైన శ్రీదేవి ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం నాడు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
 
 
Go Back to Shorts
Sridevi
rameswaram

More Telugu News